నిన్ను కోరి ట్రైలర్ వచ్చేసింది

Saturday Jun 17, 2017
Download 20170617 122658 original

నిన్ను కోరి సినిమా తో మన ముందుకు వస్తున్న నాని తన ఖాతాలో మరో హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇప్పటికే టీజర్ తో పాటు రెండు పాటలు విడుదల చేసి హైప్ సాధించాడు. అయితే ఇది హైప్ మాత్రమే కాదని సినిమా లో నిజంగానే మేటర్ ఉందని ఇవాళ విడుదల అయిన ట్రైలర్ తో నిరూపించాడు. నాని ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అయితే ఈసారి కామెడీ తో పాటు ఎమోషన్ కూడా బాగా క్యారి చేసారు. నివేద థామస్ కూడా మంచి పాత్రలో చేసింది. ఆది పినిశెట్టి ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. 

 సినెమా చాల భాగం అమెరికా లో తీసారు. నాని కెరీర్ లో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం. ఈ సినిమా ను డి వి వి దానయ్య నిర్మించారు. కొత్త దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు పని చేసారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. కోన వెంకట్ మాటలు రాసారు. జూలై 7 విడుదల కు ఈ సినిమా సిద్ధంగా ఉంది.