అనేక ఏళ్ళుగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోతున్న డాక్టర్
రాజశేఖర్ కు గరుడవేగ చిత్రంతో మంచి హిట్ అందించి అయనను ఒడ్డున పడేశాడు దర్శకుడు
ప్రవీణ్ సత్తారు. తాను సాధారణ ప్రేమ కధలు మాత్రమే కాకుండా సీనియర్ దర్శకులకు ఏమాత్రం
తీసిపోని స్థాయిలో ఇటువంటి యాక్షన్ ప్యాక్ సినిమాలను తీయగలనని గరుడవేగతో ప్రవీణ్ తన
సత్తా నిరూపించుకొన్నారు.
ఈ సినిమా తరువాత డాక్టర్ రాజశేఖర్ సినీ జీవితం
ఏవిధంగా ముందుకు సాగుతుందో తెలియదు కానీ ప్రవీణ్ సత్తారు కెరీర్ మాత్రం
జోరందుకొన్నట్లే ఉంది. అయన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లవర్ బాయ్ నితిన్
ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. నితిన్ ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీలు
చేస్తుంటాడు కనుక ప్రవీణ్ సత్తారుతో మళ్ళీ అటువంటిదే చేస్తాడో లేక వేరే ఏదైనా డిఫరెంట్
గా ట్రై చేస్తాడో చూడాలి.
ఇది
చదివారా? రంగస్థలంలో రంగులరాట్నం