దర్శకుడు అజయ్ ఆండ్ర్యూస్ నూతక్కి దర్శకత్వంలో
మంచు మనోజ్ కు అన్నివిధాలుగా సరిపోయే కధాంశంతో ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాను
రూపొందిస్తున్నారు. ఇది శ్రీలంకలో తమిళ శరణార్ధుల విషాదగాధ ఆధారంగా తీస్తున్న
చిత్రం. దీనిలో మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ.అధినేత ప్రభాకరన్ గా నటిస్తున్నాడు. ప్రభాకరన్
నేతృత్వంలో శ్రీలంకలో తమిళుల పోరాటాలు, సింహళ సైనికుల అరాచకాలు ఈ సినిమాలో
చూపించబోతున్నారు. ఈ సినిమాలో అనిషా అంబ్రోస్, రెజినా ప్రధానపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది కనుక బుధవారం దాని ట్రైలర్ విడుదల
చేశారు. ట్రైలర్ లో ..దానిలో డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ వింటుంటే గుండెలను
పిండేస్తున్నట్లుంది. ఈ సినిమాను తెలుగుతో బాటు తమిళంలో కూడా తీసి ఉంటే అక్కడి
ప్రజలు బ్రహ్మరధం పట్టేవారు. అలాగే శ్రీలంకలో తమిళుల సమస్యల గురించి యావత్
ప్రపంచానికి చాటిచెపుతున్న ఈ సినిమాను హిందీలో కూడా నిర్మించి ఉండి ఉంటే, వారి
పోరాటాలపై యావత్ దేశ ప్రజలలో నెలకొన్న అపోహలు తొలగిపోయుండేవి కదా.
ఇది చదివారా? కూతురితో అతిలోక సుందరి సీక్వెల్?