నెల్లూరులో ఆక్సిజన్ ప్రీ-రిలీజ్

Thursday Oct 12, 2017
Oxygen original

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మానుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆక్సిజన్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ 14న నెల్లూరు పట్టణంలో నిర్వహించబోతున్నారు. ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇక సినిమాలో చెప్పుకోవలసిన విశేషాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తే, అయన భార్య ఐశ్వర్య ఈ సినిమాలో రెండు పాటలు పాడారు. వాటిలో ఒకటి డ్యూయెట్ సాంగ్ కాగా మరొకటి ఫ్యామిలీ సాంగ్. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో సుమారు 90 నిమిషాల నిడివిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని తీయడానికే దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు.   ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఎఎం. రత్నం నిర్మిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ మూవీలో గోపీచంద్ మార్క్ థ్రిల్లింగ్ ఫైట్స్ ఉంటాయనే వేరే చెప్పనవసరం లేదు. ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు.