బాబోయ్..ఇదేం పేరు?

Thursday Nov 02, 2017
Pk with son original

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులకు కొన్ని రోజుల క్రితమే పండంటి బాబు జన్మించాడు. అతనిని ఒళ్ళో పెట్టుకొని చూసి మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో చాలా సర్క్యూలేట్ అయ్యింది. ఇప్పుడు ఆ బాబుకు పవన్ కళ్యాణ్ చాలా విచిత్రమైన పేరు పెట్టడంతో దానిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. ఇంతకీ ఆ బాబుకు పవన్ కళ్యాణ్ ఏమి పేరు పెట్టారో తెలుసా? ‘మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల.’ 

రష్యా దేశస్తురాలైన ఆయన భార్య అన్నా లెజినోవా క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. ఆ మతంలో ‘మార్కస్‌’ దేవుడిని ‘మార్క్’ అని క్లుప్తంగా చెప్పుకొంటారు. ఆమె మతాచారాలను గౌరవిస్తూ బాబు పేరులో మొదటి పదం ‘మార్క్’ అని పెట్టారు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవితో రాజకీయంగా విభేదించి దూరంగా ఉంటునప్పటికీ అయన తన తండ్రితో సమానమని ఇప్పటికీ చెపుతుంటారు. అందుకు నిదర్శనంగా ఆయన అసలు పేరు 'శివశంకర్‌ వరప్రసాద్‌' లో నుంచి ‘శంకర్’ ను తీసుకొని తన కుమారుడుకి పెట్టుకొన్నారు. దాని తరువాత తన పేరును, తన కుటుంబం పేర్లు ‘పవనోవిచ్ కొణిదెల’ ను కూడా జోడించి ‘మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల’ అని పెట్టారు. ఈ ఒక్క పేరులోనే చాలా పేర్లున్నాయి కనుక అందరూ దానిలో మార్క్, శంకర్, పవన్, కొణిదెల విచ్ అంటూ ఎవరికి నచ్చిన పేరుతో వారు బాబును పిలుచుకోవచ్చు. 

  ఇది చదివారా? ఆర్టీసి బస్టాండ్లలో మినీ ధియేటర్లు