దసరాకి పవన్ కళ్యాణ్ రానట్లేనా ........

Thursday Jun 08, 2017
4724 pawan kalyan trivikram movie original

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు తెలిసిందే. అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ కలిసి సినిమా చేస్తుండడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా దసరా కి విడుదల కానుందని, ఫస్ట్ లుక్ కూడా త్వరలో రాబోతోందని చాలా వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడైన అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదే అతనికి తెలుగు లో మొదటి చిత్రం.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఇంకా చాలా జరగాల్సి ఉందంట. కాబట్టి ఈ సినిమా ని దసరా రేస్ నుండి తప్పించి సంక్రాతి కి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దసరా రేస్ లో ఇక మిగిలింది బాలయ్య మరియు మహేష్ బాబు మాత్రమే.