డాక్టర్ రాజశేఖర్ కుటుంబానికి ‘సినిమా టైప్
కష్టాలు’ వరుసగా ఎదురవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఆయన
తల్లి మరణించారు. ఆ కారణంగా డాక్టర్ రాజశేఖర్ తీవ్ర డిప్రెషన్ కు గురయ్యారు. ఆ
డిప్రెషన్ లోనే హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఒక వ్యక్తి కారుని డ్డీ కొట్టడంతో
ఆయనపై పోలీస్ కేస్ నమోదయింది. కానీ ఆ వ్యక్తితో డాక్టర్ రాజశేఖర్ దంపతులు
రాజీపడటంతో కేసు ఉపసంహరించుకొన్నాడు. ఆ తరువాత డాక్టర్ రాజశేఖర్ హీరోగా చేసిన
గరుడవేగ శుక్రవారం రిలీజ్ అవుతుందనగా, దానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే గురువారంనాడు
జీవిత అన్నయ్య శ్రీనివాస్ మృతి చెందారు.
గరుడవేగ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకొనడంతో
వారి కుటుంబానికి కష్టాలు తీరాయనుకొంటే వారికి మరో కొత్త కష్టం ఎదురయింది. వారి పెద్ద
కుమార్తె శివాని శనివారం సాయంత్రం హైదరాబాద్, జూబ్లీ హిల్స్ రోడ్ నెం.73 లో తన
కారులో వెళుతుండగా, అది అదుపుతప్ప రోడ్డుపక్కనే నిలిపి ఉంచిన మరో కొత్తకారును డ్డీ
కొంది. ఆ ప్రమాదంలో ఆ కారు బాగా దెబ్బతింది. దాంతో ఆ కారు యజమాని జూబ్లీ హిల్స్
పోలీస్ స్టేషన్ లో ఆమెపై పిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు. డాక్టర్
రాజశేఖర్ కుటుంబాన్ని ఈ సినిమా టైప్ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు వెంటాడుతాయో? అంతవరకు
వారు తమ జాగ్రత్తలో తాము ఉంటే మంచిదేమో?
ఇది చదివారా? షాలినీ పాండే 100% లవ్ విత్ ప్రకాష్ కుమార్