మహేష్ తో నటించనున్న డిజె హీరోయిన్

Friday Jun 16, 2017
Pooja hegde 1 original

ముంగమూడి అనే తమిళ చిత్రం తో తెరంగ్రేటం చేసిన పూజ హెగ్డే తెలుగు లో నాగ చైతన్య సరసన 'ఒక లైలా కోసం సినిమా ' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద చిత్రం లో నటించింది. అవి రెండు పెద్దగా హిట్ కాకపోయినా ఎలాగో బాలీవుడ్ లో ఏకంగా హ్రితిక్ రోషన్ సరసన మొహేంజొదారో చిత్రం లో నటించే అవకాశం కొట్టేసింది. అయితే అది కూడా ప్లాప్ అవ్వడం తో మళ్ళీ తెలుగు లో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది. సరికొత్తగా అల్లు అర్జున్ సరసన డిజె చిత్రం లో నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కు సిద్ధం గ ఉంది. అయితే ఇంతవరకు తాను నటించిన ఏ సినిమా హిట్ కాకపోయినా ఈమెకు ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయ్. విషయం ఏంటంటే మహేష్ బాబు కు వరుసగా సినిమా లు క్యూ లో ఉన్నాయ్. ప్రస్తుతం స్పైడర్ లో న్తయిస్తున్న మహేష్ తర్వాత కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత వంశి పైడిపల్లి తో మరో సినిమా చేయబోతున్నారట. ఆ సినిమా కు పూజ హెగ్డే ని అనుకుంటున్నారట. ఒక వేళా ఇదే నిజమై సూపర్ స్టార్ పక్కన నటించగలిగితే ఇక దశ తిరిగినట్లే.