ప్రభాస్ సినిమాలో మళ్లీ తనే హీరోయిన్

Thursday Jul 06, 2017
Anushka and prabhas 1 original

బాహుబలితో బాలీవుడ్ కి కూడా సుపరిచితుడైపోయిన ప్రభాస్ ఇపుడు సుజీత్ దర్శకత్వం లో సాహో అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి 2 సినిమా అపుడు సినిమా తో పాటు ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసి మంచి హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా టీం. టీజర్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండడం తో జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అయితే ఆ సినిమా లో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు కంఫర్మ్ అవ్వలేదు. సోషల్ మీడియా లో మాత్రం బాలీవుడ్ హీరోయిన్ ఉండబోతోందని ప్రచారం సాగింది. అయితే ఇపుడు ఈ పుకార్లన్నీ కొట్టేస్తూ రమేష్ బాల అనే సినీ విశ్లేషకుడు ఈ సినిమా లో కూడా ప్రభాస్ కు జోడిగా అనుష్క నటించబోతోంది కుండా బద్దలు కొట్టేసాడు. అయితే ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే లేదు. ఇదే గనక నిజం అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న 5వ చిత్రం కానుంది. ఇప్పటికే వీళ్లిద్దరి సాన్నిహిత్యం పట్ల రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్న నేపత్యం లో ఈ కాంబినేషన్ మళ్లీ తేరా పైకి రానుండడం విశేషం.