ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి ల చిత్రం 'ప్రాజెక్ట్ z' మే లో విడుదల

Friday May 05, 2017
Project z images cnemagal original

ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి ల చిత్రం 'ప్రాజెక్ట్ z' మే లో విడుదల

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన 'మాయావన్‌' చిత్రాన్ని 'ప్రాజెక్ట్ z' గా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ సమర్పణలో  నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ..ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ 'మాయావన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'ప్రాజెక్ట్ z' గా మా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. అతి త్వరలో ఆడియోని రిలీజ్‌ చేసి, ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అన్నారు.
ఈ చిత్రానికి

సంగీతం: గిబ్రాన్,

డిఓపి: గోపి అమర్నాథ్,

ఎడిటర్: లియో జాన్ పాల్,

డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి,

ఆర్ట్: గోపి ఆనంద్,

సమర్పణ: ఎస్‌.కె. బషీద్‌, 

నిర్మాత: ఎస్.కె. కరీమున్నీసా,

స్టోరీ-దర్శకత్వం: సి.వి. కుమార్.