పవన్ అభిమానులకు స్వీట్ న్యూస్

Saturday Nov 04, 2017
Pspk 25 original

ఈనెల 7న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఆ సినిమాలోని మొదటిపాటను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో ‘అజ్ఞాతవాసి’ పేరు చలామణిలో ఉంది. కనుక నవంబర్ 7న సినిమాపేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఇంతవరకు సినిమా కాన్సెప్ట్ పోస్టర్ తప్ప ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేయలేదు కనుక ఆరోజున అది కూడా విడుదల చేస్తారేమో చూడాలి.

ఈ చిత్రంలో ఇద్దరు అందాల భామలు కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. 

ఇది చదివారా? కంగ్రాట్స్ గరుడవేగ..ఆదివారం చూస్తాం: రాజమౌళి