హాలీవుడ్ లెవెల్ లో గరుడవేగ ట్రైలర్

Tuesday Oct 17, 2017
Garudavega original

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన పి.ఎస్.వి.గరుడవేగా సినిమా ధియేట్రికల్ ట్రైలర్ కొద్ది సేపటిక్రితం హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ విడుదల చేశారుకొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ కు ఏమాత్రం తీసిపోకుండా హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నట్లుగా ట్రైలర్ ఉంది. ట్రైలర్ లో హీరోయిన్లను చూపించక పోయుంటే ఇది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా అనే అనుకొంటాము. అంత బాగుంది. ఇది యాక్షన్ మూవీ కనుక ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ చూపినట్లున్నారు.

ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ తో పూజా కుమార్, శ్రద్దాదాస్ హీరోయిన్లుగా నటించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జోస్టార్‌ ఎంటర్‌ప్రైజస్ బ్యానర్ పై ఎం.కోటేశ్వరరాజు నిర్మించారు. ఈ సినిమా నవంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.