పూరీ ‘మహబూబా’ షూటింగ్ స్టార్ట్

Wednesday Oct 11, 2017
Mehbooba original

దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి ‘మహబూబా’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు నుంచి దాని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన్నట్లు వంశీ కాక సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. పూరీ, ఆకాష్, ఛార్మీ తదితరులు హిమాచల్ ప్రదేశ్ లో ఒక విఘ్నేస్వరాలయం ముందు తీసుకొన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు.

ఈ సినిమాలో ఆకాష్ కు జంటగా కన్నడ సినీ నటి నేహా శెట్టిని తీసుకొన్నారు. 1971 భారత్-పాక్ యుద్ధం నేపద్యంలో సాగే ప్రేమకధతో ఈ చిత్రం తీస్తున్నారు. కనుక ఈ సినిమాలో పూరీ ఆనాటి యుద్ధవాతావరణాన్ని, ఆ రోజుల్లో సమాజపు తీరుతెన్నులు మొదలైనవన్నీ సమర్ధంగా చూపించవలసి ఉంటుంది.

ఈ సినిమా షూటింగ్ మొదట హిమాచల్ ప్రదేశ్ లో మొదలు పెట్టి ఆ తరువాత పంజాబ్, రాజస్థాన్  రాష్ట్రాలలో తీస్తానని పూరీ మొదటే ప్రకటించారు. ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం సమకూరుస్తున్నారు.