ఆ నలుగురు ‘క్వీన్స్’ వాట్స్ అప్ లో...

Saturday Nov 04, 2017
Queens movie heroines original

హిందీలోకంగనా రనౌత్ హీరోయిన్ గా చేసిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్స్’ ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషలలో ఒకేసారి రీమేక్ చేయడం, ఒకేసారి వేర్వేరు దర్శకులు షూటింగ్ ప్రారంభించడం విశేషమే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సలహాలు, సమాచారాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడం కోసం నలుగురు దర్శకులు వాట్స్ అప్ లో ‘క్వీన్స్’ పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం విశేషం.

ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు నీలకంఠ. తెలుగు వెర్షన్ లో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.

ఇక ‘పారిస్ పారిస్’ అనే పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ సినిమాకు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

కన్నడలో ‘బట్టర్ ఫ్లై’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీనిలో పరూల్ యాదవ్ హీరోయిన్ గా చేస్తోంది.

మలయాళంలో ‘జామ్ జామ్’ పేరుతో తీస్తున్న సినిమాలో మంజిమా మోహన్ హీరోయిన్ గా చేస్తోంది.    

ఈ నాలుగు సినిమాల షూటింగ్ ఇటీవలే మొదలైంది. వీటిలో తెలుగు, తమిళ్ వెర్షన్స్ షూటింగ్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతోంది. ఆ షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్ళిన తమన్నా, కాజల్ ఇద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేశారు. ఈ నాలుగు వెర్షన్స్ వచ్చే ఏడాది ఒకే సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇది చదివారా? నాగ్-వర్మ చిత్రంలో టబూ?