రాజా ది గ్రేట్ వచ్చేశాడు

Friday Oct 06, 2017
Raja the great original


రవితేజ, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటించిన రాజా ది గ్రేట్ థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈరోజు విడుదలైన ట్రైలర్ లో తప్పక చెప్పుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. రవితేజ పవర్ ఫుల్ డైలాగ్స్, మోహనకృష్ణ కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్. ఈ ట్రైలర్ కు ఇంగ్లీషులో సబ్-టైటిల్స్ ఇవ్వడం బాగుంది. ఇక ట్రైలర్ చివరిలో విలన్ “ఎవడ్రా నువ్వు..?” అని గట్టిగా అరిస్తే “ఐయాం ఎవారియర్” అని రవితేజ చెప్పడం, “దమ్ముంటే ఒకసారి వచ్చి నాకు వినబడు” అని చెప్పడం బాగుంది. 

అలాగే “ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా..ఎంతమంది నావైపు వస్తున్నా..మీరు వేసే అడుగు..చూసే చూపు..పీల్చే శ్వాస..ఎవ్విరీ థింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్..” అనే డైలాగ్ వెంటనే వచ్చే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. రవితేజ, మెహ్రీన్ డ్యాన్స్ సీన్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ పరువాలేదు.

ట్రైలర్ లో సంపత్ రాజ్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి ముగ్గురూ ఆదరగొట్టేశారు. ట్రైలర్ ను బట్టి ఇది పూర్తి యాక్షన్ చిత్రంలాగే కనిపిస్తోంది. అయితే అంధుడిగా నటిస్తున్న హీరోతో సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా చేయించి ఉండి ఉంటే జనానికి ఎక్కడం కష్టమే. అయితే ట్రైలర్ ను చూసి సినిమాను అంచనా వేయడం సరికాదు కనుక దీపావళికి రాజా ది గ్రేట్ వచ్చేవరకు వెయిట్ చేయడమే బెటర్.