కంగ్రాట్స్ గరుడవేగ..ఆదివారం చూస్తాం: రాజమౌళి

Saturday Nov 04, 2017
Rajamouli garudavega original

 “పి.ఎస్.వి గరుడవేగ 126.18 ఎమ్’ చిత్ర యూనిట్ కు అభినందనలు.. చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకొందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా చూసేందుకు ఆదివారానికి మేము టికెట్స్ బుక్ చేసుకొన్నాము,” అని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

నిన్న ఒకేరోజున మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో గరుడవేగ సినిమాను రాజమౌళి అంతటి గొప్ప దర్శకుడు ప్రశంసించడమే కాకుండా రేపు ఆ సినిమా చూడాలనుకోవడం ఆ సినిమా గొప్పదనం తెలియజేస్తోంది.

డాక్టర్ రాజశేఖర్, పూజా కుమార్ జంటగా నటించిన గరుడవేగను ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేశారు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో డాక్టర్ రాజశేఖర్ దంపతుల చాలా సంతోషించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఈ సినిమా టీం సభ్యులు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో డాక్టర్ రాజశేఖర్ ఇంట్లో పటాకులు కాల్చి, డ్యాన్సులు చేసి స్వీట్లు పంచుకొని పండగ చేసుకొన్నారు. దానిలో డాక్టర్ రాజశేఖర్ చాలా హుషారుగా డాన్సులు చేయడం విశేషం.

ఇప్పుడు రాజమౌళితో సహా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతుండటంతో డాక్టర్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు సంతోషంతో పొంగిపోతున్నారు. దాదాపు 15 ఏళ్ళ తరువాత డాక్టర్ రాజశేఖర్ కు దీనితో హిట్ కొట్టారు. కనుక దీని తరువాత ఏమి చేస్తారో చూడాలి. బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్ర చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. మరి బాలకృష్ణ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.  

  ఇది చదివారా? రంగస్థలం శాటిలైట్ రైట్స్ అంత పలికిందంటే...