2.0 మళ్ళీ వాయిదా పడింది

Monday Oct 30, 2017
2.0 %282%29 original

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 2.0 చిత్రాన్ని మొదట దీపావళికి ర్లీజ్ చేయాలనుకొన్నారు. కానీ సినిమాకు సంబందించిన పనులు పూర్తికాకపోవడంతో 2018, జనవరి 25న రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. కానీ వి.ఎఫ్.ఎక్స్. ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతున్న కారణంగా ఈ సినిమాను 2018, ఏప్రిల్ 13కు వాయిదా పడినట్లు సమాచారం.

మూడు రోజుల క్రితమే దుబాయ్ లో చాలా అట్టహాసంగా 2.0 చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయ్యింది. ఆ హడావుడిని చూసినప్పుడు ఇక ఆ సినిమా రిలీజ్ కు సిద్దం అయిపోయిందని అందరికీ అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు హటాత్తుగా ఈవార్త బయటకు రావడం విశేషం. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.

2.0లో రజనీకాంత్, హాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నాడు. సంగీతం: ఏఆర్ రహమాన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రహమాన్, కుతుబ్-ఏ-క్రిపా, కెమెరా: నీరవ్ షా. 

ఇది చదివారా? నాగ్ తో సినిమా నవంబర్ లో స్టార్ట్: వర్మ