రజినీకాంత్ మమ్ముట్టి తో చేతులు కలుపుతున్నారా?

Wednesday Jun 07, 2017
Rajinikanth joining hands with mammootty for kaala original

రజినీకాంత్ నటిస్తున్న"కాలా" చిత్రం గురించి రోజుకో వార్త నెట్ లో విహారం చేస్తోంది, తాజాగా వస్తున్న వార్త ఏంటంటే మలయాళ సూపర్ స్టార్ట్ మమ్మూట్టి "కాలా" లో ఒక ప్రధాన పాత్ర లో నటించబోతున్నారట. రజినీకాంత్ అల్లుడు మరియు చిత్ర నిర్మాత అయినా ధనుష్ మమ్మూట్టి ని "కాలా" లో నటించమని సంప్రదించగా అతను వెంటనే ఒప్పేసుకున్నారట. ఇదే నిజమయితే "దళపతి" చిత్రం తర్వాత పాతిక సంవత్సరాల తర్వాత ఈ జోడి మల్లి తెర మీద కనిపించబోతున్నారు.

ఇక చిత్ర విషయానికి వస్తే. ఈ చిత్రానికి పిఏ రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కబాలి తర్వాత రజినీకాంత్ తో ఆతను చేస్తున్న చిత్రం ఇది. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో రజినీకాంత్ మాఫియా డాన్ గ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబై లో జరుగుతోంది.