రంగస్థలం కొత్త ఫోటోలు

Tuesday Oct 31, 2017
Rangasthalam photos original

రామ్ చరణ్ రామ్ చరణ్ తేజ్, సమంత జంటగా నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్ కోనసీమలో శరవేగంగా సాగుతోంది. ఆ సినిమా పేరును బట్టి అదేదో నాటకరంగానికి సంబందించిన కధాంశంతో తీస్తున్నదని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ‘రంగస్థలం’ అనే పేరుతో చిన్న గ్రామాన్నే సృష్టించాడు దర్శకుడు సుకుమార్. దానినే దృవీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒక ఫోటోలో ఒక పెద్ద పెంకుటిల్లు, దాని ముందు గ్రామపంచాయితీ కార్యాలయం, ‘రంగస్థలం’ అనే ఒక బోర్డు, పక్కనే గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణల విగ్రహాలు కనిపిస్తాయి. మరో ఫోటోలో ఒక పెంకుటిల్లు, దాని వెనుక ‘రంగస్థలం’ అనే ఒక బోర్డు, పక్కనే అల్లూరి సీతారామరాజు, మరో మహిళామూర్తి విగ్రహాలు కనిపిస్తాయి. మూడో ఫోటోలో ఒక పెద్ద భవనం, డాని ముందు ఒక అంబాసిడర్ కారు, ఫియట్ కారు, పక్కనే జీపు, ట్రాక్టరు కనిపిస్తాయి. ఈ ప్రాంతాలలోనే రంగస్థలం 1985 సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కనుక బహుశః ఇవన్నీ సినిమాలో కూడా కనిపించవచ్చు.

రంగస్థలం 1985 లో జగపతిబాబు, ఆది పినిశెట్టి, గౌతమి, రంభ, అనసూయ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరంజీవి భార్య సురేఖ నిర్మిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి దీనిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదలకాబోతోంది.

  ఇది చదివారా?  శ్రీయ స్వీట్ అండ్ హాట్ ఫొటోస్