రంగస్థలంలో రంగులరాట్నం

Monday Nov 06, 2017
Rangasthalam location photo 1 original

రామ్ చరణ్ తేజ్, సమంత జంటగా నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్ లొకేషన్ ఫోటోలు ఒకటొకటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులలో ఆ సినిమాపై నానాటికీ ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు ఆ సినీ బృందం. సోమవారం మరొక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో సాధారణంగా పల్లెటూర్లలో తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసే తాత్కాలిక దుఖాణాలు...పల్లెటూరివాళ్ళు, మరోపక్క రంగులరాట్నం...దాని చెక్కగుర్రాలపై కూర్చొని గిర్రున తిరుగుతున్న పిల్లలు..పెద్దలు, మరోపక్క గుర్రబండి వగైరాలున్నాయి.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరంజీవి భార్య సురేఖ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్.రత్నవేలు అందిస్తున్నారు.

ఇది చదివారా? భాగమతి ఫస్ట్-లుక్ చాలా బీభత్సం