రవితేజ తరువాత చిత్రం పేరు అదేనా?

Wednesday Oct 11, 2017
Sreenu ravi teja original

మాస్ మహారాజ్ రవితేజ్ దాదాపు ఎడాదిన్నర గ్యాప్ తీసుకొన్నాక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’, తరువాత విక్రం సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ చేస్తున్నాడు. వీటిలో మొదటిది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల తరువాత దర్శకుడు శ్రీను వైట్లతో ఒక సినిమా చేయబోతున్నాడు. దానిలో రవితేజ మూడు డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. కనుక ఆ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం.

రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ అంధుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహ్రీన్ ఫిర్జాదా అతనికి జోడీగా నటించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా ఐటెం సాంగ్ చేసింది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, వివాన్ బంతెన తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ, సంగీతం: సాయి కార్తీక్ అందించారు.