రవితేజ కూడా సంక్రాంతికే టచ్ చేస్తాడుట!

Thursday Nov 02, 2017
Fouru films original

ఈసారి సంక్రాంతి పండుగకు ఒకేసారి అనేక పెద్ద, చిన్న హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటిలో విక్రం సిరికొండ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘టచ్ చేసి చూడు,’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి జనవరి 10న విడుదలకాబోతున్నాయి.

ఆ మర్నాడు అంటే జనవరి 11న సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న రంగస్థలం 1985, సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సాక్ష్యం చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

వాటి తరువాత జనవరి 12న కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న జైసింహా విడుదలకాబోతోంది. ఇవి కాక మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కనుక ఈసారి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ కూడా ప్రేక్షకులకు పసందైన విందుభోజనం వంటి రకరకాల చిత్రాలు వడ్డించబోతోందన్నమాట. మరి వాటిలో ఏది గొప్పగా ఉంటుందో చూడాల్సిందే.

ఇది చదివారా? బాబోయ్..ఇదేం పేరు?