బాబాయ్ తో పోరు కి సిద్ధం అంటున్న రామ్ చరణ్-కొత్త సినిమా టైటిల్ అదిరింది

Friday Jun 09, 2017
3024480645785598159 account id 2 original

రామ్ చరణ్, సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేస్తున్న చిత్రం టైటిల్ వచ్చేసింది. సినిమా టైటిల్ కూడా కొత్తగా తన స్టైల్ లో కొత్తగా పెట్టే సుకుమార్ ఈసారి కూడా అదే రిపీట్ చేసారు. పల్లెటూరు నేపత్యం లో సాగే ఈ సినిమా కు 'రంగస్థలం' అనే టైటిల్ ను ఖరారు చేసారు. టాగ్ లైన్ 1985 అని పెట్టారు. పోస్టర్ లో పల్లెటూరి వేషధారణలో ఉన్న రాంచరణ్ స్కెచ్ ఉంది. 1985 లో పల్లెటూరి నేపత్యం లో సాగే ఈ సినిమా టైటిల్ ను ఇంగ్లీష్ లో రాయడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. దసరా కి వస్తుందనుకున్న చిత్రం షూటింగ్ లో ఆంతర్యం వాళ్ళ సంక్రాతి కి రాబోతోంది. ఈ విషయాన్నీ కూడా టైటిల్ పోస్టర్ లో సంక్రాతి రిలీజ్ అని వెల్లడించారు. కాబట్టి ఇక 2017 లో రామ్ చరణ్ నుండి సినిమా రానట్లే. ఇతను చివరగా 2016 లో తమిళ్ రీమేక్ అయినా ధ్రువ తో హిట్ కొట్టారు. 
ఈ చిత్ర విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ మొదటి సారిగా నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ గ సినిమా లు తీసే సుకుమార్ ఈసారి పల్లెటూరి నేపత్యం లో సినిమా తీయబోతున్నారు. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ లుక్ మొత్తం మార్చేశారు. ఈ చిత్రం లో కథానాయిక గ సమంత నటించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, నరేష్, ఆది పినిశెట్టి నటించబోతున్నారు. 
   ఈ చిత్రం సంక్రాతి కి రానుండడం తో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాతో పోటీ నెలకొంది. మరి సంక్రాంతికి బాబాయ్ మెప్పిస్తాడా అబ్బాయి మురిపిస్తాడా అనేది వేచి చూడాల్సి ఉంది.