ఆ సినిమాకి వర్మ ముహూర్తం పెట్టేశాడు

Wednesday Nov 01, 2017
Nagarjuna  rgv original

నాగార్జునతో తీయబోయే సినిమాకు రామ్ గోపాల్ వర్మ ముహూర్తం పెట్టేశాడు. నవంబర్ 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతానని ఫేస్ బుక్ లో ప్రకటించేడు. హిందూ దేవుళ్ళపై..మతాచారాలపై సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మ ఈ సిన్మాకు ముహూర్తపు షాట్ను అన్నపూర్ణా స్టూడియోలో తీస్తానని తెలిపాడు. పైగా తమ మొదటి సినిమా శివకూడా అక్కడే ప్రారంభించామని గుర్తు చేశాడు. అంటే వర్మకు కూడా దేవుడు, నమ్మకం, సెంటిమెంట్లు ఉన్నాయనుకోవాలా? లేక నాగార్జున కోసమే వాటిని ఫాలో అవుతున్నాడనుకోవాలా?

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమా పేరు ప్రకటిస్తున్నప్పుడే దాని ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేస్తుంటాడు. అలాగే ఆ సినిమాపై వివాదం సృష్టించేందుకు దానికి సంబంధించి ఏదో ఒక విషయం ప్రస్తావిస్తుంటాడు. కానీ అటువంటివేవీ చేయలేదు అంటే ఈ సినిమా విషయంలో అతను నాగార్జునకు నచ్చినట్లుగానే ముందుకు సాగబోతున్నాడని భావించవచ్చు. రెగ్యులర్ షూటింగ్ డేట్ ప్రకటించేశాడు కనుక త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

సుమారు రెండున్నర దశాబ్దాల తరువాత నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గనుక ఇది ఏవిధంగా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇద్దరు కొడుకులు సినిమాలు చేస్తున్న సమయంలో కూడా నాగార్జున ఇంకా వరుసపెట్టి హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఆయన కెరీర్ విజయవంతంగా సాగుతున్న ఈ సమయంలో ఒక్క హిట్ చిత్రాన్ని కూడా ఇవ్వలేకపోయినా వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్నారు. మరి వర్మ నాగార్జున కేరీర్ లో శివవంటి మరో గొప్ప చిత్రాన్ని అందిస్తాడో లేక ఆయన కెరీర్ కు మాయని మచ్చని మిగులుస్తాడో చూడాలి.  

  ఇది చదివారా? జై సింహా ఫస్ట్-లుక్