సమంత చైతన్య పెళ్లి తేదీ ఖరారు...

Thursday Jun 08, 2017
Dby0hvrv0aajtex original

ఎట్టకేలకు నాగ చైతన్య సమంత ల వివాహ తేదీ ఖరారయింది. చాలా కలం నుండి ప్రేమ లో ఉన్న ఈ జంట వచ్చే అక్టోబర్ 6 న ఒకటి కాబోతున్నారు. పెళ్లి కోసం సమంత తన సినిమా ల నుండి బ్రేక్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె అట్లీ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఒక చిత్రం లో విజయ్ సరసన నటిస్తున్నారు. అలానే మహానటి సావిత్రి జీవితం గురించి తీస్తున్న సినిమా లో ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. వీటితో పాటు నాగార్జున తో పాటు రాజు గారి గది 2 లో కనిపించబోతున్నారు. ఇక చైతన్య విషయానికి వస్తే రారండోయ్ వేడుక చూద్దాం తో ఒక డీసెంట్ హిట్ కొట్టి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ పెళ్లి క్రైస్తవ మరియు హిందూ సంప్రదాయాల ప్రకారం జరుగుతున్నట్లు సమాచారం. పెళ్లి గోవా లో జరుగబోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.