హిందీ సినిమాయే..కానీ ఈ ట్రైలర్ చూసి తీరాల్సిందే!

Monday Oct 09, 2017
Padmavati original

బాలీవుడ్ దర్శకనిర్మాత, రచయిత సంజయ్ లీలా బన్సాలీ గురించి ఉత్తరాదివారికేకాదు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు కూడా బాగానే తెలుసు. అయన ఎన్నుకొనే కధలు...వాటిని అద్బుతంగా చిత్రీకరించే తీరు హిందీ బాష తెలియనివారినైనా ఫిదా చేసేస్తాయి. 13-14 శతాబ్దం కాలంనాటి రాజస్థాన్ మహారాణి పద్మావతి కధ ఆధారంగా ఆయన పద్మావతి అనే చిత్రం తీస్తున్నారు. దానిలో రాజస్తాన్ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ కొందరు, రాణీ పద్మావతిని అగౌరవపరిచేవిధంగా ఆమె పాత్రను రూపొందించారని మరికొందరు అభ్యంతరాలు చెపుతున్నారు. వారి అభ్యంతరాల మద్యే ఆయన ఈరోజు ఆ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ మూడు నిముషాలు ట్రైలర్ ను చూస్తుంటే మనం కూడా ఆరోజుల్లోకి..రాజ్ మహల్ లోకి వెళ్లిపోయినట్లు..యుద్ధక్షేత్రం మద్య నిలబడి చూస్తునట్లు అనిపిస్తుంది. అంత గొప్పగా ఉన్నాయి ఆ ట్రైలర్ లో చూపించిన దృశ్యాలు..దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..నటీనటుల డైలాగ్స్ వగైరాలు. ట్రైలర్ లో రిచ్ నెస్..ఆ బారీతనం చూస్తుంటే కేవలం సంజయ బన్సాలీ మాత్రమే వాటిని సృష్టించగలరనిపిస్తుంది. దాని గురించి ఇంకా వర్ణించడం కంటే మీ కళ్ళతో మీరే చూసి ఆనందించండి..

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోనె రాణి పద్మావతిగా నటించగా, రతన్ సింగ్ పాత్రలో షాహీద్ మహారావాల్ నటించాడు. రణవీర్ అల్లాఉద్దీన్ ఖిల్జీగా నటించాడు.