కూతురితో అతిలోక సుందరి సీక్వెల్?

Wednesday Nov 01, 2017
Sridevi janhavi original

ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి, మళ్ళీ ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ‘మామ్’ తో వరుసగా రెండో హిట్ కొట్టింది. ఇప్పుడు ఆమె పెద్ద కూతురు జాహ్నవి కూడా సినీ పరిశ్రమలోకి రావాలని తెగ తహతహలాడుతోంది. త్వరలోనే జాహ్నవి ఎంట్రీ ఖాయం అనుకొంటున్న సమయంలో ఒక తాజా వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే..ఆ సినిమాలో ఆమె ఒక్కర్తే కాదు తల్లి శ్రీదేవి కూడా చేయబోతోందిట. 1987లో శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన సూపర్ హిట్ చిత్రం మిష్టర్ ఇండియాకు అది సీక్వెల్ అని సమాచారం. ఆ సినిమాకు మామ్ సినిమా దర్శకురాలు రవి ఉద్యవార్ దర్శకత్వం చేయబోతున్నారుట. కనుక ఈ సినిమాలో తల్లీకూతుళ్ళు ఇద్దరూ నటనలో పోటీపడబోతున్నారన్న మాట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.  

 ఇది చదివారా? ఆ సినిమాకి వర్మ ముహూర్తం పెట్టేశాడు