తమిళ్ అర్జున్ రెడ్డికి జోడీ ఆమేనా?

Tuesday Oct 10, 2017
Vikrams son dhruv shriya sharma original

తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ హక్కులను హీరో ధనుష్ తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే కోలీవుడ్ లో అగ్రస్థాయి హీరోలలో ఒకడైన ధనుష్ ఆ సినిమాలో తానే హీరోగా వేయకుండా అర్జున్ రెడ్డి పాత్రకు ప్రముఖ కోలీవుడ్ నటుడు చియాన్ విక్రం కుమారుడు దృవ్ ను హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాను ఈ-4 ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ లో ముకేష్ మెహతా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి రెండు తాజా వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. 1. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు బాలను ఎంచుకొన్నారు. 2. దృవ్ పక్కన హీరోయిన్ గా ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకొన్న శ్రీయ శర్మను తీసుకోబోతున్నట్లు సమాచారం. దర్శకుడిగా బాలను తీసుకోవడం ఖరారయింది కానీ శ్రీయ శర్మ పేరు ఇంకా ఖరారు చేయవలసి ఉంది.    

తెలుగు వెర్షన్ లో ముద్దు సీన్లలో రెచ్చిపోయి నటించేసిన షాలినీ పాండేనే తమిళంలో కూడా తీసుకొంటారని మొదట వార్తలు వినిపించినప్పటికీ ఇప్పుడు కొత్తగా శ్రీయ శర్మ పేరు వినిపిస్తోంది. ఆమెతో సహా మిగిలిన పాత్రలకు కూడా త్వరలోనే నటీనటుల ఎంపికను పూర్తి చేసి వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాలని ధనుష్ భావిస్తున్నారు.