'నరకాసురుడు'గా సందీప్

Monday Jun 19, 2017
Sundeep kishan narakasurudu movie first look 1497846146 100 original

వరుసగా సినిమా లు చేస్తున్న వాటిలో చాలా వరకు పెండింగ్ లో ఉండడమో కొన్ని కారణాల వాళ్ళ రిలీజ్ కాకాపోడమో జరుగుతుండడంతో సందీప్ కిషన్ ఆపసోపాలు పడుతున్నాడు. అయినా తానూ సినిమాలు తీస్తూనే ఉన్నాడు.ఎపుడు కొత్త కొత్త కథలను ఎంచుకొని ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఇప్పటికే కృష్ణ వంశి దర్శకత్వం లో తెరకెక్కుతున్న నక్షత్రం లో సందీప్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎపుడు రిలీజ్  అవుతుందో చెప్పలేం. అలాగే మరో ముగ్గురు హీరో ల తో కలిసి శమంతకమణి అనే సినిమా లో నటిస్తున్నాడు. అయితే ఇపుడు సరికొత్తగా ఒక తమిళ్ సినిమా లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి తమిళ్ లో 'నరకాసురన్' అనే టైటిల్ పెట్టారు. ఇదే సినిమా తెలుగు లో 'నరకాసురుడు' గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం లో అరవింద్ స్వామి కూడా ఒక మంచి పాత్ర చేయబోతున్నారట. సందీప్ కిషన్ కు తమిళం లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ చిత్రం లో కథానాయిక గా శ్రేయ నటిస్తోంది. మొదట ఈ చిత్రానికి నాగ చైతన్య ని హీరో గా అనుకున్నారట.కానీ చివరికి సందీప్ కి దక్కింది. ఈ చిత్రాన్ని కార్తీక్ నరేన్ దర్శకత్వం లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నారు. ఈ దర్శకుడు తీసిన '16' తమిళ్ లో మంచి హిట్ కొట్టింది.