చి.ల.సౌ. రుహానీతో వస్తున్న సుశాంత్

Thursday Oct 12, 2017
Sushanth ruhani sharma movie original

పెళ్ళి శుభలేఖలలో ఆనవాయితీగా వదువు పేరుకు ముందు ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ అని వేస్తుంటారు. దానినే కట్ చేస్తే ‘చి.ల.సౌ.’ అవుతుంది...అదే సుశాంత్ నిన్న మొదలుపెట్టిన కొత్త సినిమా పేరు. దీనికి యువ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో రుహాని శర్మని హీరోయిన్ గా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, విద్యులేఖ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో లాంచనంగా మొదలైంది.