ఆర్టీసి బస్టాండ్లలో మినీ ధియేటర్లు

Thursday Nov 02, 2017
Mini theatre original

వీడియో క్యాసెట్స్ జమానాలో చిన్నచిన్న వీడియో థియేటర్లు నడిచేవి. కానీ ఆ తరువాత సిడిలు వచ్చినప్పటికీ ప్రతీ ఇంట్లో కేబుల్ టీవిలు వచ్చేయడం, సినీ ప్రదర్శనలపై పైరసీ చట్టాలతో కటినమైన నిబంధనలు అమలులోకి రావడంతో మినీ ధియేటర్లు మూతపడ్డాయి. నానాటికీ సినిమా హాల్స్ టికెట్ ధరలు పెరిగిపోవడం, చిన్న సినిమాలకు థియేటర్లు లభించకపోవడం, కొత్తగా అనేకమంది ఔత్సాహిక దర్శకులు వరుసగా చిన్న సినిమాలు తీస్తుండటం వంటి అనేక కారణాల చేత మళ్ళీ మినీ ధియేటర్లను ప్రారంభించాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే విజయవాడ బస్ స్టేషన్ లో మినీ ధియేటర్ ప్రారంభం అయ్యింది. త్వరలో తెలంగాణా రాష్ట్రంలో కూడా ప్రారంభంకాబోతున్నాయి.

వాటిని ఎక్కడో నిర్మించడం కంటే నిత్యం రద్దీగా ఉంటే ఆర్టీసి బస్ స్టేషన్లలో నిర్మించినట్లయితే, అటు ఆర్టీసికి అదనపు ఆదాయం, బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులకు కాలక్షేపం, చిన్న సినిమాల ప్రదర్శనకు అవకాశం లభిస్తుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వాటి ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.

మొదటిదశలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 బస్ స్టేషన్లలో ధియేటర్ల ఏర్పాటుకు నవంబర్ 8లోగా టెండర్లు సమర్పించాలని కోరింది. ధియేటర్ల ఏర్పాటు చేయదలచుకొన్నవారు వాటికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు www. eprocurement.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చునని అధికారులు తెలిపారు.  

ఇది చదివారా? ఒక్కడు మిగిలాడు ట్రైలర్