నాగ్-వర్మ చిత్రంలో టబూ?

Saturday Nov 04, 2017
Tabu original

నాగార్జున-టబు హీరోహీరోయిన్లుగా నటించిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సూపర్ హిట్ సినిమా వారి సినీకెరీర్ లో ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు. సుమారు 27 ఏళ్ళ తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ చేయబోయే సినిమాలో ఆమెను తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తను వర్మ లేదా నాగ్ ఇంకా దృవీకరించవలసి ఉంది. ఈ సినిమా కాకుండా టబూ మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి నెలాఖరున ప్రారంభం కానున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో టబూ ఒక ముఖ్యపాత్ర చేయబోతోందిట. కనుక టబూ మళ్ళీ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లే అనుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సీనియర్ హీరోయిన్లలో చాలా మంది వరుసగా అనేక సినిమాలు చేస్తూ మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. కనుక టబూ కూడా ఈ రెండు సినిమాలతో మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అయిపోతుందేమో?    

ఇది చదివారా? అప్పుడే మహేష్ సినిమాకి 3 పాటలు రెడీ