పవన్ కళ్యాణ్-అను ఇమ్మానుయేల్, కీర్తి
సురేష్ హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా
తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ బ్రేక్ లో పవన్ కళ్యాణ్,
అను ఇమ్మానుయేల్ కాఫీ త్రాగుతూ కూర్చొని కబుర్లు చెప్పుకొంటుంటే, దర్శకుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సెల్ఫీ ఫోటోను తీసారు. ఆ ఫోటోను అను ఇమ్మానుయేల్ తన
ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్రిందన “గుడ్ కంపెనీ..గుడ్ వర్క్” అని
కామెంట్స్ పెట్టింది. అంటే పవన్-త్రివిక్రమ్ ఇద్దరితో పనిచేయడం చాలా హాయిగా ఉందని
చెపుతోందనుకోవచ్చు.
ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్
ప్రచారంలో ఉంది. ఈవారంలో ఈ సినీ యూనిట్ షూటింగ్ కోసం యూరప్ బయలుదేరబోతోంది. ఈ షెడ్యూలో 3 పాటలను,
మూడు దేశాలలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్
పూర్తవుతుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ
నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతోంది.
ఇది చదివారా? ఆ నలుగురు ‘క్వీన్స్’ వాట్స్ అప్ లో...