సునీల్ నుండి మరో ప్లాప్ సినిమా రాబోతోందా...?

Thursday Jun 08, 2017
Ungarala rambabu trailer review original

సునీల్ నుండి మరో ప్లాప్ సినిమా రాబోతోందా...? అవుననే అనిపిస్తోంది ఉంగరాల రాంబాబు ట్రైలర్ చూస్తే. సునీల్ నటించిన అన్ని కామెడీ సీన్స్ కలిపి మిక్సీ లో ఏసి కొడితే ఈ ట్రైలర్ ఆ అనిపిస్తోంది. ట్రైలర్ లో అసలు మేటర్ ఏ లేదు. అన్ని రొటీన్ గానే ఉన్నాయ్. తింగరి హీరో గా సునీల్ చేసే రొటీన్ కామెడీ. అందరు హీరో లు కొత్త కొత్త కథలను ఎంచుకొని హిట్లతో దూసుకుపోతుంటే సునీల్ మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి లా రొటీన్ కామెడీ సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే క్రాంతి మాధవ్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. మియా జార్జ్ కథానాయికగా కనపడబోతోంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 
ట్రైలర్ అంతగా లేకున్నా సినిమా లో కంటెంట్ ఉంటె హిట్ అవ్వడం ఎవరు ఆపలేరు. మరి ఉంగరాల రాంబాబు లో ఆ కంటెంట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.