పంచెకట్టు దేనికంటే...నాన్న చెప్పాడు

Monday Oct 09, 2017
Vijay devarakonda original

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే చాలా పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా కుర్రకారుకి ఐకాన్ గా మారిపోయాడు. అతనిని విజయ్..దేవరకొండ..అని కొందరు పిలుస్తుంటే...అర్జున్ రెడ్డి అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో అతనికి పెద్ద ఫాలోయింగ్ ఏర్పడింది. కనుక ఇప్పుడు అర్జున్ రెడ్డి...సారీ విజయ్ దేవరకొండ ఏమి చేసినా అందరికీ ఆసక్తే. కనుక వారి ఆ క్రేజ్ ను మెయింటెయిన్ చేస్తున్నట్లుగా అతను ఒక ఫంక్షన్ లో మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో చక్కగా పంచె కట్టుకొని రావడంతో అందరూ కాసేపు ఆశ్చర్యపోయారు తరువాత చాలా మెచ్చుకొన్నారు. “మా నాన్నగారు కట్టుకొన్నారు అందుకే నేను కూడా కట్టుకొన్నాను. చెప్పిందే చేశాను,” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

అర్జున్ రెడ్డి చిత్రంలో పెరిగిన గెడ్డంతో బూచోడులా కనిపించిన అతను పంచెకట్టులో ఎంతః హుందాగా ఉన్నాడో మీరు చూడండి.