దేవరకొండకు అప్పుడే ఆ ఛాన్స్ వచ్చేసిందా?

Friday Nov 03, 2017
Maniratnam vijay devarakonda original

విజయ్ దేవరకొండ తెలుగులో 2011 నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. గత ఏడాది విడుదలైన పెళ్ళి చూపులుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత ఈ ఏడాది విడుదలై అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అర్జున్ రెడ్డితో చాలా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి చిన్నాపెద్దా దర్శకులు అందరూ క్యూ కడుతున్నారు. విచిత్రం ఏమిటంటే వారిలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా ఉండటమే. ఆయన సినిమాలు సూపర్ హిట్ కాకపోతున్నపటికీ, ఆయన చాలా గొప్పగా తీస్తారు కనుక దక్షిణాదినే కాకుండా ఉత్తరాదివారు కూడా ఆయన సినిమాల పట్ల మక్కువ చూపుతుంటారు. కనుక టాలీవుడ్, కోలీవుడ్ లో చిన్నాపెద్దా హీరోహీరోయిన్లు అందరూ ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకొంటారు. మహేష్ బాబు కూడా ఆయనతో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందుగా విజయ్ దేవరకొండకు అవకాశం లభించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మహానటి’, దాని తరువాత ఏం మాత్రం వేశావేసినిమాలు చేస్తాడు. మణిరత్నం కూడా ప్రస్తుతం తను చేస్తున్న సినిమాను పూర్తి చేసిన తరువాతే విజయ్ దేవరకొండతో సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. కనుక వారిరువురి సినిమా వచ్చే ఏడాది ఎప్పుడో మొదలయ్యే అవకాశం ఉంది.

ఇది చదివారా? వర్మతో సినిమా..నాగ్ ఏమన్నారంటే..