చేసిన ఫ్లాప్స్ చాలు..

Monday Nov 06, 2017
Vijayendra prasad original

సినీ పరిశ్రమలో రచయితలు దర్శకులుగా మారడం కొత్తవిషయమేమీ కాదు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి సక్సెస్స్ ఫుల్ డైరెక్టర్లు మన కళ్ళముందే ఉన్నారు. అయితే మంచి రచయితలుగా పేరు సంపాదించుకొన్నవారు మంచి దర్శకులుగా నిలద్రొక్కుకోలేనివారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అటువంటివారిలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. అయన అనేక తెలుగు, హిందీ సినిమాలకు మంచి కధలు అందించారు. ఆయన ఇచ్చిన కధతో సినిమా తీస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ కావలసిందేననే గట్టి నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. కనుక ఆయన వ్రాసుకొన్న కధలను అయనే స్వయంగా డైరెక్ట్ చేసుకొంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ కావాలి. కానీ పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్లు, అయన వ్రాసుకొన్న కధలను స్వయంగా డైరెక్ట్ చేయబోయి చేతులు కాల్చుకొన్నారు. ఆయన 1996లో అర్ధాంగి, 2006లో శ్రీకృష్ణ, 2011లో రాజన్న, 2017 శ్రీవల్లి అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో రాజన్న తప్ప మిగిలిన మూడు ఫ్లాప్ అయ్యాయి. శ్రీవల్లి సినిమా రిలీజ్ అయిన 3-4 రోజులకే ధియేటర్ల నుంచి ఎత్తేశారు. ఆ చేదు అనుభవం తరువాత ఇకపై మళ్ళీ సినిమాలకు దర్శకత్వం చేయకూడదని నిర్ణయించుకొన్నట్లు ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

“సినీపరిశ్రమను ఇంత దగ్గర నుంచి చూస్తున్నప్పుడు అన్నీ మనకు తెలిసినట్లే అనిపిస్తాయి కానీ అవి పైకి కనబడినంత తేలికైన పనులుకావని శ్రీవల్లి ఫ్లాప్ తో నాకు అర్ధం అయ్యింది. కనుక ఇక మీదట దర్శకత్వం జోలికిపోదలచుకోలేదు. ఇక నుంచి కధలపై పూర్తి దృష్టి పెడతాను,” అని చెప్పారు. 

ఇది చదివారా? వర్మను నాగ్ దారిలో పెట్టినట్లేనా?