లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత ఎవరంటే..

Saturday Oct 07, 2017
Rgv rakesh reddy original

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత పేరును తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అయన ఏమని మెసేజ్ పెట్టారంటే “నా దర్శకత్వంలో వస్తున్న “లక్ష్మి'స్ యన్ టి ఆర్” చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి. నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని,” అని మెసేజ్ పెట్టి దాని క్రింద తమ ఇద్దరి ఫోటోను కూడా పెట్టారు.

రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాకు ఆ పేరు ఎంచుకొన్నప్పుడే ఆ సినిమాలో ప్రధానంగా ఏమి చూపించబోతున్నాడో..ఎవరిని టార్గెట్ చేసుకోబోతున్నాడో అర్ధం అయ్యింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ఎవరు వెన్నుపోటు పొడిచారో వారి నిజస్వరూపాలను బయటపెడతానని చెపుతూ మళ్ళీ ఈ సినిమాను రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడానికే తీయలనుకొంటున్నామని రామ్ గోపాల్ వర్మ చెప్పడం నొసటితో వెక్కిరిస్తూ నోటితో నవ్వుతున్నట్లుంది. ఆ సినిమాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బద్ధ విరోధి అయిన వైసిపికి చెందిన నేత పి.రాకేష్ రెడ్డిని నిర్మాతగా ఎంచుకోవడంతో ఆయన ఉద్దేశ్యాలు తేటతెల్లమయ్యాయి. ఏమైనప్పటికీ, దీనితో రామ్ గోపాల్ వర్మ పెద్ద సంచలనమే సృష్టించబోతున్నాడని చెప్పవచ్చు కానీ దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడే ఎవరూ ఊహించలేరు.