'డిజె' తో అల్లు అర్జున్ హిట్ కొట్టగలడా....?

Thursday Jun 08, 2017
Allu arjun dj main original

రెగ్యులర్ ఫార్ములా సినిమాలు హిట్ అవ్వడం మానేసి చాల కాలమే అయింది. దీంతో కమర్షియల్ సినిమా లు చేసి వసూళ్లను రాబట్టడం ఒక రకంగా కష్టమే అయిపోయింది. సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తో పాటు జనం కొత్తదనం కూడా ఎక్పెపెక్ట్ చేస్తున్నారు. పాత పద్దతిలోనే హిట్ కొట్టాలనుకుంటే తెరమరుగవడం పక్కా. శ్రీను వైట్ల నే దీనికి మంచి ఉదాహరణ. ఇలాంటి సందర్భంలో సరైనోడు తో పెద్దగా హిట్ టాక్ రాకపోయినా వసూళ్ల పరంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే  అత్యంత ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈసారి కూడా డిజె తో అలంటి మ్యాజిక్ ఎ రిపీట్ చేయగలరా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది . అల్లు అర్జున్ యాక్టింగ్, పూజ హెగ్డే అండ చందాలు తప్ప ట్రైలర్ లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏం లేకపోడం అలానే ట్రైలర్ లో సీన్స్ పాత ఫార్ములా సినిమా ల ను పోలి ఉండడం చుస్తే ఈ చిత్రం పై అనుమానాలు వస్తున్నాయ్. ఆలా అని అల్లు అర్జున్ మార్కెట్ ని తక్కువ అంచనా వేయలేం. సరైనోడు సినిమా యావరేజి టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టిన అల్లు అర్జున్, ఇక డిజె హిట్ అయితే ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తాడనటంలో సందేహం లేదు