టైటిల్ సరే, మరి అసలో?

Thursday Mar 09, 2017
Sai dharam tej next new look cinemagala original original

టైటిల్ సరే, మరి అసలో?

కెరీర్ ఊపు మీదుంది, హడావిడి గా సినిమాలు సైన్ చేసేసి స్టార్ట్ చేసేసాడు మన మెగా మేనల్లుడు. సరే కలిసొచ్చినంత కాలం మార్కెట్ ని తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్ళాడు. మధ్యలో తిక్క అని ఒక దెబ్బ తిన్నాడు. సేఫ్ గేమ్ ఆడదామని మెగా బేస్ స్ట్రాంగ్ గా ఉన్న మాస్ సినిమా తీసి హిట్ కొట్టేద్దామనుకున్నాడు. టైటిల్ విన్నర్ అని పెట్టేసి సినిమా తీసేసి రిలీజ్ కూడా చేసేసాడు.

తీరా ఇప్పుడు ఇంకా గట్టి దెబ్బె తగిలేలా ఉంది. సినిమాకి ఏ కోశానా పాజిటివ్ టాక్ రాకపోవటం తో ఓపెనింగ్స్ లో స్ట్రాంగ్ గానే ఉన్నా ఈ రేస్ గుర్రం బాగా వెనుకబడిపోయింది. సినిమా తో సంబంధం లేకుండా జరుగుతున్న ప్రీ-రిలీజ్ బిజినెస్ ఈ సినిమా కి కూడా 25 కోట్లు పైగా ఉండటం తో ఇప్పుడు ఈ సినిమా డిసాస్టర్ గా మారబోతుంది.

మొదటి రెండు రోజులు 8 కోట్లు వచ్చినా, తరువాత మాత్రం అతి కష్టం మీద 10  కోట్లు మార్క్ దాటాడు సాయి. ఇప్పుడు మందగించిన ఈ సినిమా కలెక్షన్స్ తో 15 కోట్లు కూడా రావటం గగనం గా మారింది. దీనితో ఈ సినిమా కనీసం 10 కోట్ల లాస్ తో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. కట్ చేస్తే డిసాస్టర్.

పోనీ తరువాత సినిమాలు ఎమన్నా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయా అంటే ఆ సూచనలు కూడా కనపడట్లేదు. నెక్స్ట్ కృష్ణ వంశీ సినిమాలో చిన్న గెస్ట్ రోల్, ఆ తరువాత బి వీ స్ రవి తో జవాన్. రెండిటి మీద ఎక్సపెక్టషన్స్ కానీ లేక హైప్ కానీ పెద్ద లేవు, సినిమా అప్పటికి వస్తాయని నమ్మకం కూడా లేదు, మరి ట్రైలర్ లు టీజర్ లు అదరగొట్టేస్తే తప్ప.

మొత్తానికి టైటిల్ లో ఉన్నా "విన్నర్" మాత్రం కాదు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్. అర్జెంటు గా తన ఖాతా లో ఒక హిట్ పడితే తప్ప ఈ మెగా మేనల్లుడు సెట్ అయ్యేలా కనపడట్లేదు.